ఆమె పేరు రాములమ్మ(25). నిండు గర్భిణి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఈమె శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో వెళ్లింది. ఒంట్లో నలతగా ఉందని, కాన్పు వచ్చేలా ఉందని ఆస్పత్రి సిబ్బందికి చెప్పుకుంది. కానీ, వారు ఆమె మాటలను లక్ష్యపెట్టలేదు. 'ప్రసవానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉందిలే.. వెళ్లిపో..' అంటూ వెనక్కి పంపేశారు