సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీలో జై తెలంగాణ అంటేనే సస్పెండ్ చేశారని, తెలంగాణకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించినా పంపేశారని.. అసలు కుర్చీలోంచి లేస్తేనే సస్పెండ్ చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాంటిది సభను అడ్డుకుంటే ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నించారు.