వృత్తినైపుణ్యం ఉండి, పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రాలకు వలసపోయిన చేనేత కార్మికులు తిరిగి సొంతగడ్డ తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ఆయన ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు.