కశ్మీర్‌లో భద్రతాబలగాలు కీలక విజయాన్ని సాధించాయి. లష్కరే ఈ ఇస్లామ్ అధినేత అబ్దుల్ ఖయ్యూం నజార్‌ను మట్టుబెట్టాయి. యూరి సెక్టార్ గుండా భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన ఖయ్యూం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో హతమయినట్లు భద్రతా దళాలు ధృవీకరించాయి. కశ్మీర్‌లో సైనికులకు పట్టు పెరుగుతుండటంతో పాకిస్థాన్‌కు పారిపోయిన ఖయ్యూం తిరిగి కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. బారాముల్లాలో ఉగ్రశిబిరాన్ని ప్రారంభించి.. తిరిగి తన కార్యకలాపాలనను ప్రారంభించాలనుకున్నాడని నిఘా సంస్థలు తెలిపాయి. ఇతడిపై భారత ప్రభుత్వం 10 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. ఖయ్యూం మరణం ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ అని అధికారులు తెలిపారు.