బాబు ఇంటి వద్ద తమ్ముళ్ల క్యూ | tdp-leaders-meet-chandra-babu | Sakshi
Sakshi News home page

Nov 30 2014 2:44 PM | Updated on Mar 21 2024 7:52 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటివద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. ఏపీలో డిసెంబర్ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో నాయకుల తాకిడి పెరిగింది. టీడీపీ నాయకులు చంద్రబాబును కలసి తమ బయోడేటాలను అందజేశారు. నామినేటెడ్ పదవులకు తమ పేర్లను పరిశీలించాల్సిందిగా బాబుకు విజ్ఞప్తి చేశారు. టీటీడీ పాలక మండలి సహా వివిధ పదవుల భర్తీకి బాబు కసరత్తు చేస్తున్నారు. ఇదిలావుండగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement