ఏపీని మధ్యాంధ్రప్రదేశ్ గా చేయాలని అధికారులకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశాలిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఎన్నికల హామీల్లో బెల్టుషాపులు తొలగిస్తామన్న టీడీపీ ఇప్పుడు ప్రజలను మరింతగా తాగండని పిలుపునిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. బాబుపాలన చూస్తే 'నారా వారి సారా స్రవంతి' తరహాలో ఉందన్నారు. 'మనఊరు- మన సారా సేవించండి' పథకాలు పెడతారేమో అన్నారు. ఆర్థికలోటు పూడ్చుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 6 లక్షల ఫించన్లు కోత విధించడం దారుణమన్నారు. చేతగానప్పుడు, చేవలేనప్పడు ఎందుకు హామీలిచ్చారని నిలదీశారు. నిజాయితీ, చిత్తశుద్ధివుంటే హామీలకు కట్టుబడాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
Sep 30 2014 5:45 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement
