సంచలనం సృష్టించిన సూర్యపేట వద్ద నోట్ల కట్టలతో తగలబడిన కారు ఇంజన్లో మొత్తం రూ.2.5 కోట్లు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ వెల్లడించారు. ఆ కారు ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి హుజూర్నగర్ వెళ్తున్న ఇన్నోవా కారు ఇంజన్లో జనగామ ట్రంకురోడ్డు వద్ద అగ్నిమంటలు ఎగసిపడ్డాయి. దాంతో కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. దాంతో స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. ఆ క్రమంలో ఇంజన్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదుపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇంజన్లో ఉన్న భారీ నగదు చూసి అవాక్కయ్యారు. కారు అద్దంపై మాత్రం ఎమ్మెల్యే స్టిక్కర్పై మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని రాసి ఉంది. దాంతో పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు ఆ ఘటనపై భన్వర్లాల్కు సమాచారం అందించారు. దాంతో ఆయన విచారణకు ఆదేశించారు. అయితే కారు ఇంజన్లో ఉంచిన నగదులో కొంత భాగం కాలిపోయిన సంగతి తెలిసిందే.కారులో వెయ్యి, ఐదోందల నోట్ల కట్టలు తగలబడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దాంతో భన్వర్ లాల్ ఆ ఘటనపై ఆరా తీశారు.