లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే! | rajgopal reddy, the same person behind leakage of medical entrance papers | Sakshi
Sakshi News home page

Jul 27 2016 5:52 PM | Updated on Mar 20 2024 3:45 PM

అది 2014 సంవత్సరం. మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష పేపర్ లీకైన విషయం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అందులో కీలక నిందితుడు రాజగోపాల రెడ్డి. అతడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు. కట్ చేస్తే.. 2016 సంవత్సరం.. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2 మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీకైందని సీఐడీ నిర్ధారించింది. ఇందులోనూ కీలక నిందితుడు రాజగోపాలరెడ్డే!! అప్పుడూ ఇప్పుడూ కూడా అదే వ్యక్తి మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్లను లీక్ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం తాజాగా తెలంగాణ సీఐడీ విచారణలో తేలింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement