వివాదాస్పద మతబోధకుడు, 130 మంది భార్యలకు భర్త, 203 మంది పిల్లలకు తండ్రి అయిన మొహమ్మద్ బెలో అబూ బకర్ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. 93 ఏళ్ల అబూ బకర్ నైజీరియాలోని బిడా రాష్ట్రంలోగల తన నివాసంలో తుదిశ్వాస విడిచనట్లు ఆయన సహాయకులు ఆదివారం మీడియాకు తెలిపారు.