ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను నిజామాబాద్ ఎంపీ కవిత శుక్రవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గనడానికి వచ్చిన ఆమె సదస్సు అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.