నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు నేడు మూడో రోజుకు చేరుకుంది. నాలాలపై అక్రమ కట్టణాల కూల్చివేత, అభివృద్ధిపై సీఎం కేసీఆర్ బుధవారం రాత్రి సమీక్షించారు. నగర అభివృద్ధికి బ్యాంకర్ల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పురపాలకశాఖ, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ను, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు