క్షిపణుల ప్రయోగం సక్సెస్ | India Successfully Test Fires Surface-To-Air Missile Developed With Israel | Sakshi
Sakshi News home page

Sep 21 2016 10:36 AM | Updated on Mar 21 2024 9:52 AM

భారత రక్షణదళం తన సామర్థ్యాన్ని పెంచుకొనే దిశగా మరో రెండు కొత్త క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారు చేసిన ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సుదూర క్షిపణులను (ఎల్‌ఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా మంగళవారం ఉదయం 10:13 గంటలకు మొదటి ప్రయోగాన్ని, 14:25 గంటలకు రెండో ప్రయోగాన్ని నిర్వహించినట్లు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు. ట్రయల్ పరీక్ష విజయవంతమైందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement