ఆధునిక జీవనశైలి కారణంగా హృద్రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ధమనుల ద్వారా శరీరం నుంచి గుండెకు రక్తం సరఫరా అవుతుంది. ఈ ధమనుల్లో కొవ్వు చేరితే గుండెకు చేరే రక్తం తగ్గిపోతుంది. కొవ్వుతో ధమనుల్లో ఏర్పడే అడ్డుగోడలను బ్లాకేజ్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో స్టెంట్ అమర్చుతారు. రోగి కాళ్లు లేదా చేతులకు ఓ చిన్న రంధ్రం చేసి రక్తనాళాల ద్వారా సన్నని తీగలాంటి ట్యూబ్‌ను లోపలికి పంపిస్తారు. దీన్నే క్యాథడ్రెల్ అంటారు. క్యాథడ్రెల్ ద్వారా స్టెంట్‌ను గుండె నాళాల్లోకి పంపుతారు. తర్వాత స్టెంట్‌ను బ్లాకేజ్ మధ్యలో అమర్చితే గుండెకు రక్తం సరఫరా సాఫీగా జరుగుతుంది.
Feb 24 2017 2:37 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement