దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్ మళ్లీ గుజరాత్‌లో కాలు మోపుతున్నారు. పటేళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమించిన హార్దిక్ పటేల్ మీద ప్రభుత్వం రాజద్రోహ నేరం మోపిన సంగతి తెలిసిందే.