బిహార్‌లో బ్యాలెట్ యుద్ధానికి తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు ఐదు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. బిహార్ ప్రస్తుత శాసనసభ కాలపరిమితి నవంబర్ 29తో ముగియనుంది. 2010లో జరిగిన గత ఎన్నికల్లో 6 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. బిహార్‌లో 6.68 కోట్లమంది ఓటర్లున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో పరాజయం చవిచూసిన బీజేపీకి.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా జట్టుకట్టిన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా లౌకిక కూటమికి ఈ ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకం. ముఖ్యంగా, బీజేపీ ప్రధాన ప్రచార కర్త ప్రధాని మోదీ.. జేడీయూ నేత, సీఎం నితీశ్‌కుమార్‌ల ప్రజాదరణకు ఇవి విషమ పరీక్షగా నిలవనున్నాయి. ఇప్పటికే ఈ రెండు కూటములు ప్రచారాన్ని ప్రారంభించాయి. రెండు దశాబ్దాల లాలూ-నితీశ్‌ల పాలనకు అంతం పలికే లక్ష్యంతో.. మోదీ బిహార్‌కు రూ. 1.65 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే దసరా, ఈద్, మొహర్రం, చాత్ మొదలైన ప్రధాన పండుగలు వస్తుండటంతో ఈ ఎన్నికల నిర్వహణ ఈసీకి కత్తిమీద సాములా మారింది.
Sep 10 2015 7:22 AM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement