కంటి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కాలయముడై కాటేశాడు. తండ్రి దగ్గర తనకు రక్షణ ఉంటుందని భావించిన 11 ఏళ్ల బాలికపై ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో మూగబోయిన ఆ పసిగొంతు బిక్కుబిక్కుమంటూ గడిపింది. అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.