పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ రకంగా ప్రభుత్వానికి, బ్యాంకులకు అగ్ని పరీక్ష అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం అన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000నోట్లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరం బుధవారం మీడియాతో మాట్లాడారు. నల్లధనాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే తాము సమర్థిస్తామని చెప్పారు.