కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, దీని అమలు తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అతి పెద్ద కుంభకోణమని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని అన్నారు.