పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు వీలుగా బీజేపీ మద్దతు కూడగట్టేందుకోసం కాంగ్రెస్ చర్చలు కొనసాగిస్తోంది. బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడితో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం రహస్య మంతనాలు సాగించారు. ఈ భేటీలో అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నట్టు సమాచారం.