రాజకీయాల్లో హరీష్ రావు ఓ బచ్చా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ను పార్టీని టీఆర్ఎస్ కడిగేయడం కాదు.. ప్రజలే టీఆర్‌ఎస్‌ను కడిగేసే సమయం ముందుందని ఆయన హెచ్చరించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోపై చర్చించడానికి హరీష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. సమయం, వేదిక ఎక్కడైనా తాను రావడానికి సిద్ధం అని అన్నారు.