చిదంబరం కావాలనుకుంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని అదే పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తాను మాత్రం రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతరులు అధ్యక్షుడయ్యే అవకాశముందని చిదంబరం ఇటీవల వ్యాఖ్యానించడంతో రగడ మొదలైంది. తర్వాత తన వ్యాఖ్యలపై చిదంబరం వివరణయిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మైనారిటీ సమ్మేళనంలో దిగ్విజయ్ సింగ్ తో పాటు ఏఐసీసీ మైనారీటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్, ఆర్.సి. కుంతియా పాల్గొన్నారు.
Nov 23 2014 9:28 PM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement