ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరం లేకపోయినా పవర్ ప్రాజెక్టులు కడుతోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2.2 శాతం మాత్రమే విద్యుత్ కొరత ఉందన్నారు. బొగ్గు ధరలు తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని, థర్మల్ విద్యుత్ పెరిగి కొరత దేశమంతటా తగ్గిందన్నారు. రాబోయే పదేళ్లపాటు విద్యుత్ కొరత ఉండదని బుగ్గన తెలిపారు. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్లో ఒక్కో మెగావాట్కు రూ.6.3 కోట్లు, విజయవాడ ఎన్టీపీసీలో రూ.5.85 కోట్లు ఖర్చు అవుతోందని వివరించారు.
Jul 13 2016 2:28 PM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement