రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ విద్యార్థినిపై బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న పత్తి ఐశ్వర్య ఈ దాడిలో గాయపడింది. ఉదయం కళాశాలకు వెళుతుండగా 9.30 గంటల సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఆమె చేతిపై బ్లేడ్‌తో కోసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ డి.రామారావు కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించారు.
Sep 23 2015 12:20 PM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement