బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు శుక్రవారం బెంగళూరులో ప్రారంభమయ్యింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్ నేతలు ఎల్కె అద్వానీ, వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షత జరుగుతున్న ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. పార్టీ బలోపేతంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సుకు 111 మంది సభ్యుల కార్యవర్గంతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ఆహ్వానితులు హాజరు అయ్యారు. ఇప్పటికే కార్యవర్గసదస్సులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలను అమిత్‌షా సిద్దం చేశారు. సదస్సు అనంతరం సాయంత్రం అయిదు గంటలకు నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే పార్టీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.