తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గురువారం నాడు సమైక్య బంద్ పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. సమైక్య బంద్ను విజయవంతం చేయాలని పార్టీ కోరింది. బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఢిల్లీ గుండెలు అదిరేలా సమైక్య నినాదం వినిపించేలా పార్టీ శ్రేణులన్నీ ఈ బంద్లో ముందుండాలని తన పార్టీ కేడర్ను ఆదేశించింది