‘ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు’ | AU professor samireddy on AP Status Issue | Sakshi
Sakshi News home page

Sep 22 2016 12:55 PM | Updated on Mar 21 2024 10:58 AM

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వేలం పాట మాదిరిగా చేశాయని ఆంధ్రయూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై గురువారం శ్రీ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన యువభేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశాన్ని డబ్బుతో కొలవడానికి వీల్లేదని అదోరకమైన భావన అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజల నోళ్లు మూయించలేరని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement