క్విడ్ ప్రో కో కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు పూర్తైందని నాంపల్లి సీబీఐ కోర్టుకు సీబీఐ తెలిపింది. జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రాజకీయంగా అత్యంత ప్రభావశీలి అయిన జగన్‌ను ఈ పరిస్థితుల్లో విడుదల చేస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయరాదని కోర్టును కోరింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు దాఖలు చేసిన ఆర్సీ నెంబర్ 19/ఏ కేసుకు సంబంధించి అన్ని అంశాల్లో తమ దర్యాప్తు ముగిసిందని సీబీఐ... కోర్టుకు వెల్లడించింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయమని మాత్రమే సీబీఐ చెప్పిందని...పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేయాలనే ప్రస్తావన లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరో వైపు జగన్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సుశీల్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిందని చెప్పినందున బెయిల్ మంజూరు చేయాలని సుశీల్ కుమార్ కోర్టును కోరారు.
Sep 18 2013 11:30 AM | Updated on Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement