ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాలుగో రోజు సమావేశమైన 20 నిమిషాలకే వాయిదా పడింది. విపక్షాల ఆందోళనతో సభ 15 నిమిషాలు పాటు వాయిదా పడింది. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించొద్దని మంత్రులు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. విపక్ష సభ్యులు పట్టు వీడకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
Sep 3 2015 9:19 AM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement