ఎన్నికల రాష్ట్రం పంజాబ్‌లో ఇప్పుడో కొత్త ప్రచారం మొదలైంది. ‘నవజ్యోత్ సింగ్ సిద్దూను ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి..’ అని సందేశమిస్తున్న రాష్ట్రమంతటా పోస్టర్లు వెలుస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ వయసు ప్రస్తుతం 75 ఏళ్లు. ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్యం సాకుతో అమరీందర్‌ను పక్కన పెడతారని, సిద్దూను సీఎం చేస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటికితోడు కెప్లెన్ కూడా ‘నేను పోటీ చేసే చివరి ఎన్నకలు ఇవే’నని స్పష్టం చేశారు. వీటన్నింటిపై కెప్టెన్ అమరీందర్ మీడియాకు వివరణ ఇచ్చారు.