ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఎపీ సీఎం చంద్రబాబు వాయిస్ రికార్టులపై ఫోరెన్సిక్ ల్యాబరేటరీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబుకు సంబంధించిన ఆడియోలపై నివేదికను ఈ రోజు కోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అదే విధంగా ఓటుకు నోటు కేసు ఫిర్యాదుదారుడు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఏసీబీ అధికారులు సీఆర్‌పీసీ 164 కింద అనుమతి కోరుతూ కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ఏసీబీ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అనుమతించే ఛాన్స్ ఉంది.