తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో పదకొండు మంది ప్రతిపక్షాల సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని సమర్పించగా.. కేజీ టు పీజీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, విద్యారంగ సంస్ధలపై టీటీడీపీ, బీజేపీలు వాయిదా తీర్మానాన్ని సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు నిర్వహించకముందే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.