13 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు! | 13 Ministers, 20 MLAs, 9 MLCs to resign over Telangana? | Sakshi
Sakshi News home page

Aug 1 2013 2:45 PM | Updated on Mar 22 2024 11:31 AM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌ చేస్తున్న సీమాంధ్ర ప్రాంత మంత్రులు మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించారు. సీమాంధ్ర మంత్రులు ఈ రోజు ఇక్కడ మినిస్టర్‌ క్వార్టర్స్‌- క్లబ్‌ హౌజ్‌లో సమావేశమై రాజీనామాలు స్పీకర్ ఫార్మేట్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో 13 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకు రాజీనామాలు ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రికి, స్పీకర్కు రాజీనామాలు అందజేస్తామని చెప్పారు. అధిష్టానం నిర్ణయంతో తమకు సంబంధంలేదని మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి చెప్పారు. తామంతా సాయంత్రం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement