వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్పై విడుదల అవ్వడం పట్ల యూఎస్లోని వైఎస్ ఫ్యాన్ క్లబ్ హార్షం ప్రకటించింది. ఈ సందర్బంగా లాస్ ఏంజెల్స్లోని హాలివుడ్లోని ఐసోటోప్లో శుక్రవారం సాయంత్రం వైఎస్ ఫ్యాన్స్ క్లబ్ యూఎస్ఏ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వేలాది మంది వైఎస్ ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ ఫ్యాన్స్ క్లబ్ యూఎస్ఏ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల మాట్లాడుతూ... వైఎస్ జగన్ సారథ్యంలో సమైక్య ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతోందని ఆకాంక్షించారు. అలాగే జగన్ రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులన్ని సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున్న ఎగసి పడుతోన్న ఉద్యమానికి సారథ్యం వహిస్తారని వైఎస్ ఫ్యాన్స్ ధర్మారెడ్డి గుమ్మడి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారం కోసం కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన కలలు కల్లలు అయ్యాయని ధర్మారెడ్డి గుమ్మడి గుర్తు చేశారు. 2014లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి పరాభవం కాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలు క్విడ్ ప్రో కో చేస్తున్నాయని మల్లిక్, వేణు కాటురీలు ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు అన్ని తొలిగిపోయి మచ్చలేని నాయకుడిగా సాధ్యమైనంత త్వరలో బయటకు వస్తారని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాల్య స్నేహితుడు డాక్టర్ ప్రేమ్ రెడ్డి ఆకాంక్షించారు. జగన్ జైలు నుంచి విడుదల కావడం చాలా ఆనందం కలిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నగేష్, మల్లికారెడ్డి, ప్రసాద్ రాణీ,బయ్యప రెడ్డి, వేణు రెడ్డి, సాయి, రాజా రెడ్డి, సందీప్, ప్రవీణ్, రామకృష్ణలతోపాటు పలువురు వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.