బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ కు డెంగ్యూ సోకినట్లు శుక్రవారం నిర్దారణ అయింది. ప్రస్తుతం జుహు తారా రోడ్డులోని సొంత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. డెంగ్యూ కలిగించే దోమల(ఎడెస్ ఏఈజిప్టీ జాతి) నిరోధానికి మార్గదర్శకాలు పాటించనందుకు విద్యాబాలన్ ఇరుగుపొరుగు వారిపై బీఎంసీ కొరడా ఝుళిపించింది.