తమ్ముడికి అన్న మార్గదర్శకుడయ్యాడు. అందుకే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తున్నారు. ఇంతకీ ఈ ఆదర్శ సోదరులెవరన్నదేగా మీ ఉత్సుకత. అక్కడికే వస్తున్నా. కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయకులుగా వెలుగొందుతున్న సోదర ద్వయం ఎవరంటే టక్కున వచ్చే సమాధానం సూర్య, కార్తీలనే. నటులుగా సొంతంగా ఎదిగిన వీరు ఇప్పుడు నిర్మాతలుగానూ రాణించడానికి సిద్ధం అయ్యారు. ఇంతకు ముందు వరకూ ఉమ్మడి చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌లో చిత్రాలు చేస్తూ వచ్చిన సూర్య, కార్తీ ఇప్పుడు విడివిడిగా నిర్మాణ సంస్థలను ప్రారంభించి చిత్రాలు చేస్తున్నారు.