ఈసారి ఆర్‌బీఐ పరపతి సమీక్షతో సంబంధం లేకుండా బేస్ రేటు తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీహెచ్ పేర్కొంది. బేస్‌రేటు నిర్ణయించడానికి ఆర్‌బీఐ నిర్దేశించిన కొత్త ఫార్ములా ప్రకారం దాదాపు అన్ని బ్యాంకులు బేస్ రేటును తగ్గించాల్సి వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ తెలిపారు