కొద్ది రోజుల నుంచి క్రమేపీ తగ్గిన బంగారం ధర గురువారం ఒక్కసారిగా ఎగిసింది. ఈ ఒక్క రోజులోనే 10 గ్రాముల ధర రూ. 400 వరకూ పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటు 0.25 శాతం –0.50 శాతం శ్రేణి నుంచి 0.75 శాతం –1 శాతానికి పెంచడం, అనూహ్య రీతిలో డాలర్ ఇండెక్స్ 101 కిందకు జారి, 100 స్థాయికి చేరడం అంతర్జాతీయంగా పసిడి ఊతం ఇచ్చింది.