
డీఎస్సీ రోస్టర్ ఇలా!
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ పరీక్షకు సమయం దగ్గరపడుతోంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన పోస్టుల ప్రక్రియలో భాగంగా రోస్టర్, రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఉమ్మడి కడపజిల్లాలో 705 పోస్టులకు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, కార్పొరేషన్, మున్సిపాలిటి పరిధిలోని పాఠశాలలకు చెందిన పోస్టులకు సంబంధించి సబ్జెక్టుల వారీగా, కులల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించారు. దీంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కి సంబంధించి ఆమోదం పొందడంతో ఆ వర్గానికి సంబంధించి ఎస్సీ ఏ, బీ, సీగా పోస్టులను విడివిడిగా ప్రకటించారు.
దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటికీ ఇబ్బందులే..
అసలే డీఎస్సీ పరీక్షలకు గడవు తక్కువగా ఉందని ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు దరఖాస్తుల్లో తలెత్తే సమస్యలు చికాకు పడుతున్నాయి. లెక్కలేనని నిబంధనలు.. సర్టిఫికెట్ల అప్‌లోడ్ చేయడం తదితర సమస్యలతో పాటు మరికొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్, బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ రాసి అర్హత మార్కులు సాధించారు. తాజా డీఎస్సీకి దరఖాస్తు చేసుకుంటే అర్హత లేదని చూపిస్తోందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో వివరాలు ఇలా...
సబ్జెక్టు బీసీ ఏ బీ ిసీ డీ ఈ ఈడబ్లుఎస్ ఓసీ ఎస్సీఎ బీ సీ ఎస్టీ మొత్తం
ఎస్‌ఏ ఇంగ్లిష్ – – – – – – – 1 – – – 01
ఎస్‌ఏ హిందీ – – – – – – 1 – – – – 01
బీఎస్ టీఎం – – – – – – 1 1 – – – 02
మ్యాథ్స్ యూఎం – – – – – – 1 – – – – 01
పీహెచ్ ఈడీఎన్ – – – – – – 1 – – – – 01
సోషియల్ టీఎం – – – – – – 1 – – – – 01
ఎస్‌జీటీ తెలుగు 2 2 – 1 1 2 8 – 1 2 2 21
మొత్తం 2 2 0 1 1 2 13 2 1 2 2 28
కార్పొరేషన్ పరిధిలో వివరాలు ....
సబ్జెక్టు బిసిఏ బి సి డి ఈ ఈడబ్లుఎస్ ఓసీ ఎస్సీఎ బి సి ఎస్టీ మొత్తం