మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే ఊరుకోం

Dec 2 2025 9:52 AM | Updated on Dec 2 2025 9:52 AM

మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే ఊరుకోం

మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే ఊరుకోం

నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా బీసీలకు పెద్దపీట వేస్తూ జనరల్‌ స్థానాల్లో అవకాశాలు కల్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తీన్మార్‌ మల్లన్న విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ పార్టీ బీసీ నేతలు అన్నారు. సోమవారం నల్ల గొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూకూరి రమేష్‌, మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, వంగూరి లక్ష్మయ్య.. పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో యాదగిరి అనే వ్యక్తి కిడ్నాప్‌ ఒక రాజకీయ డ్రామా అని, ఆ పంచాయితీలో జోక్యం చేసుకొని మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే చింతపండు నవీన్‌ (మల్లన్న) వీపు చింతపండు అవుద్దని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఆయా గ్రామాల నాయకులకే మంత్రి అప్పగించారని, ఇలాంటి పంచాయితీలో తలదూర్చలేదన్నారు. కిడ్నాప్‌ అంటూ నాటకాలు ఆడే యాదగిరికి తన భార్యను కొట్టడంతో పాటు తల్లిదండ్రులకు అన్నం పెట్టని చరిత్ర ఉందని, అలాంటి వ్యక్తి మాటలు నమ్మి మంత్రిని విమర్శించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదని అన్నారు. తీన్మార్‌ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించడంలో కోమటిరెడ్డి కృషి ఉందని చెప్పారు. మల్లన్న బీసీల కోసం పోరాడితే తమ మద్దతు ఉంటుందని.. కానీ మంత్రిని విమర్శిస్తే ఊరుకోమన్నారు. గతంలో రెండు పర్యాయాలు పుల్లెంల వెంకటనారాయణగౌడ్‌ను మున్సిపల్‌ చైర్మన్‌గా చేశారని, జనరల్‌ స్థానంలో కూడా బీసీ అయిన వెంకటనారాయణగౌడ్‌కు పదవి ఇచ్చి రాష్ట్ర మున్సిపల్‌ చాంబర్‌ చైర్మన్‌ పదవిని కూడా ఇప్పించారని గుర్తుచేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, బీసీ సంఘాల నేతలు జూలకంటి శ్రీనివాస్‌, ప్రదీప్‌ నాయక్‌, జెర్రిపోతుల భాస్కర్‌, బొజ్జ రమేష్‌యాదవ్‌, అల్లి సుభాష్‌యాదవ్‌, ఇటికాల శ్రీనివాస్‌, పిల్లి రమేష్‌యాదవ్‌, గోగుల గణేష్‌యాదవ్‌, గోవర్ధన్‌గౌడ్‌, బొడ్డుపల్లి రాజేష్‌, భువనగిరి ప్రభాకర్‌, పాలకూరి శ్రీధర్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement