క్రీడాకారులు దేశం గర్వించేలా రాణించాలి
హాలియా : క్రీడాకారులు దేశం గర్వించేలా రాణించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాలియా పట్టణంలోని టైం స్కూల్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 51వ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి అండర్– 20 బాలికల కబడ్డీ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలు ఈ ప్రాంతంలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేష్ ముదిరాజ్, మద్ది మహేందర్‌రెడ్డి, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూలోకరావు, కర్తయ్య, హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, నాయకులు కాకునూరి నారాయణ గౌడ్, టైం స్కూల్ డైరెక్టర్ మందా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి


