హామీ పత్రం
తుర్కపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. తుర్కపల్లి మండలంలోని రుస్తాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండాపురం శ్రీహరికుమార్ తాను గెలిస్తే చేసే పనులను బాండ్ పేపర్‌పై రాసి ప్రజలకు దాని ప్రతులు అందిస్తున్నారు. ప్రజ లకు ఉచిత మంచినీటిసరఫరా, బస్టాప్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఆరోగ్య కేంద్రం, పశువుల దవాఖాన నిర్మాణంతో పాటు 15 అంశాలతో కూడిన హామీ పత్రాన్ని విడుదల చేశాడు. ఈ పనులను 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానంటూ ప్రకటించిన హామీ పత్రాన్ని ప్రచురించి ప్రజలకు అందిస్తున్నాడు.


