సీఎం బందోబస్తుకు వెళ్లొస్తుండగా ప్రమాదం
గుర్రంపోడు, నల్ల గొండ: నారాయణ్‌పేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బందోబస్తుకు వెళ్లి నల్లగొండకు కారులో వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి గుర్రంపోడు మండలం తానేదార్‌పల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మధు తెలిపిన వివరాల ప్రకారం. నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైలుగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, శ్రీధర్, సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు గాయాలు కాగా నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ సిబ్బందిని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పరామర్శించారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
వలిగొండ : కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. సుంకిశాలకు చెందిన మొగిలిపాక శ్రీకాంత్ కారులో సుమారుగా రూ.42,500 విలువగల 39 లీటర్ల మద్యం రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈమేరకు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.
ఫ చెట్టును ఢీకొన్న కారు ఫ నలుగురికి గాయాలు


