రూ.24 కోట్ల లిక్కర్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.24 కోట్ల లిక్కర్‌

Dec 2 2025 9:52 AM | Updated on Dec 2 2025 9:52 AM

రూ.24

రూ.24 కోట్ల లిక్కర్‌

ఆలేరు: మొన్నటి వరకు స్టాక్‌ లేక బోసిబోయిన మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుకువచ్చిన నూతన మద్యం పాలసీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 82 మద్యం షాప్‌లు కొత్త యజమానుల చేతికి మారాయి.దుకాణాలను నిర్వాహకులు మామిడి తోరణాలు, పూలతో అలంకరించి, ముహూర్తం చూసి ప్రారంభించారు. ఈ నూతన పాలసీ 2027 నవంబర్‌ వరకు అమల్లో ఉండనుంది. వరుస ఎన్నికలు, మేడారం జాతర ఉండటంతో ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎకై ్సజ్‌ శాఖ అంచనా వేస్తోంది.

నాలుగు సర్కిళ్లు, 82 వైన్స్‌లు

జిల్లాలోని ఆలేరు, మోత్కూరు, రామన్నపేట, భువనగరి ఆబ్కారీ సర్కిళ్ల పరిధిలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. పాత దుకాణాలకు లైసెన్స్‌ గడువు నవంబర్‌ 30 తేదీ రాత్రి 10 గంటలకు ముగిసింది. వచ్చే రెండేళ్లకు గాను కొత్తగా లైసెన్స్‌ పొందిన వ్యాపారులు 29,30 తేదీల్లో మద్యం లిఫ్టింగ్‌కు ఇండెంట్‌ పెట్టారు. ఆదివారం రాత్రి నుంచి బోగారంలోని లిక్కర్‌ డిపోనుంచి మద్యం స్టాక్‌ను తమ దుకాణాలకు తరలించారు. చీఫ్‌ లిక్కర్‌ నుంచి ఖరీదైన మద్యం వరకు లిఫ్ట్‌ చేశారు

భారీగా స్టాక్‌

సాధారణ రోజుల్లో అయితే మూడు రోజులకోసారి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.15 కోట్ల మద్యం స్టాక్‌ను వైన్స్‌ల యజమానులు లిఫ్ట్‌ చేస్తుంటారని సమాచారం. తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కో షాప్‌ నిర్వాహకులు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల చొప్పున జిల్లా మొత్తం రూ.20.50 కోట్ల నుంచి రూ.24.60 కోట్లు విలువ చేసే లిక్కర్‌ దుకాణాలకు లిఫ్ట్‌ చేసినట్టు తెలిసింది.

మడిగెలపై అభ్యంతరాలు

పాత వైన్స్‌లు కొనసాగిన చోటే కొత్తవాటిని కొనసాగించడంపై స్థానికుల నుంచి ఆభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన రహదారుల పక్కన, జనా వాసాల మధ్య దుకాణాలు ఉండటం వల్ల స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతాయని, రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని పలు ప్రాంతాల ప్రజలు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయమై ఆబ్కారీ అధికారులు దృష్టిసారించారు.

నృసింహుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల ను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వైజ్రవైఢూర్యాలు, వివిధ పుష్పమాలికలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు.. ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రనామ పఠనాలు పఠిస్తూ లక్ష పుష్పార్చన నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రాకా ర మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం తదితర పర్వాలను పాంచారాత్రగమశాస్త్ర రీతిలో చేపట్టారు.

స్వామియే.. శరణం అయ్యప్పా

గిరి ప్రదక్షిణ అనంతరం శ్రీస్వామి వారి దర్శనానికి ప్రధానాలయంలో బారులుదీరిన అయ్యప్ప స్వాములు

రికార్డు స్థాయిలో వచ్చిన స్టాక్‌

కళకళలాడుతున్న లిక్కర్‌ షాప్‌లు

అమల్లోకి వచ్చిన నూతన మద్యం పాలసీ

ఉల్లంఘనులపై నజర్‌

ఆలేరు : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్‌ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా నూతన మద్యం దుకాణాల్లో తనిఖీ చేశారు. ఆలేరు ఎకై ్సజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూరు మండలాల్లోని వైన్స్‌ల్లో సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. ఇండెంట్‌ ప్రకారం లిక్కర్‌ తరలించారా లేదా రికార్డులను పరిశీలించారు. నిర్వాహకులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధనలకు లోబడి అమ్మకాలు చేయాలని, లేని పక్షంలో లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్‌చరించారు.

రూ.24 కోట్ల లిక్కర్‌1
1/4

రూ.24 కోట్ల లిక్కర్‌

రూ.24 కోట్ల లిక్కర్‌2
2/4

రూ.24 కోట్ల లిక్కర్‌

రూ.24 కోట్ల లిక్కర్‌3
3/4

రూ.24 కోట్ల లిక్కర్‌

రూ.24 కోట్ల లిక్కర్‌4
4/4

రూ.24 కోట్ల లిక్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement