రెండో రోజు నామినేషన్ల కోలాహలం
సాక్షి, యాదాద్రి : మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే స్థానాల్లో రెండో రోజు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్‌వేయడానికి అభ్యర్థులు బారులుదీరారు. సర్పంచ్‌లకు 270, వార్డుసభ్యుల స్థానాలకు 957 నామినేషన్లు పడ్డాయి. రెండో రోజుల్లో కలిపి సర్పంచ్‌లకు 380, వార్డులకు 1,123 నామినేషన్లు దాఖలయ్యాయి. భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఐదు మండలాల్లో 150 సర్పంచ్‌లు, 1,332 వార్డు స్థానాలకు ఈ నెల 14 రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.
రేపటి నుంచి మూడవ విడత
మూడో విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో బుధవారం నుంచి నామినేషన్ల ఘట్ట ప్రారంభం కానుంది. 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూ రు, అడ్దగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లోని 124 సర్పంచ్ స్థానాలు, 1,086 వార్ఢు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు.
తొలి దశలోఅర్హత సాధించిన నామినేషన్లు
తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ బుధవారం నుంచి మొదలుకానుంది. పరిశీలన అనంతరం 153 గ్రామ పంచాయతీల్లో 698 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. 1,284 వార్డులకు 3,065 నామినేషన్లు అర్హత సాధించాయి.
రెండో విడత.. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు
మండలం జీపీలు నామినేషన్లు
పోచంపల్లి 21 37
భువనగిరి 34 41
బీబీనగర్ 34 69
వలిగొండ 37 79
రామన్నపేట 24 44
మొత్తం 150 270
వార్డు సభ్యులకు..
పోచంపల్లి 192 123
భువనగిరి 294 173
బీబీనగర్ 284 297
వలిగొండ 330 189
రామన్నపేట 232 175
మొత్తం 1332 957
సర్పంచ్‌లకు 270, వార్డు స్థానాలకు 957
టోకెన్లు జారీ చేసి సమయం
ముగిసినా అనుమతి
నేటితో ముగియనున్న
మలి విడత నామినేషన్ల స్వీకరణ
రెండో రోజు నామినేషన్ల కోలాహలం


