రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
వలిగొండ: మండలంలోని లోతుకుంట గ్రామ మోడల్‌స్కూల్ విద్యార్థి నకబోయిన బాల్‌రాజు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. నల్లగొండ జిల్లా కనగల్‌లో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో బాలరాజు ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో అతన్ని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు ఫిజికల్ డైరెక్టర్ ఐలయ్య తెలిపారు.
నిబద్ధతకు మారుపేరు భారతీయులు
మోత్కూరు : నమ్మకం, నిబద్ధతకు మారుపేరు భారతీయులని, అందుకే భారతీయులకు ప్ర పంచస్థాయిలో గుర్తింపు ఉందని మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి, డీఎస్పీ కొత్త బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అంతర్జాతీయంగా పేరొందిన మైక్రోసాప్ట్, గూగుల్ తదితర సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ పరశురాములు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నరసింహారెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్లు లింగస్వామి, సీహెచ్‌అంజయ్య, లెక్చరర్లు ఈశ్వర్‌రావు, నరసింహ, వై.నర్సిరెడ్డి, ఎం.సుజాత, డి.మంజుల, సతీష్, కె.శ్యామ్ పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో
పారదర్శకత పాటించాలి
భూదాన్‌పోచంపల్లి: ఉపాధిహామీ పనుల్లో పా రదర్శకత పాటించాలని, లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని అడిషనల్ డీఆర్‌డీఏ సురేశ్ అధికారులకు సూచించారు. సోమవారం భూదాన్‌పోచంపల్లిలోని మండల మహిళాస మాఖ్య భవనంలో నిర్వహించిన 16 వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనులకు ఖర్చు చేసిన డబ్బులు, ఆడిట్ రిపోర్టులో వ్యత్యాసం లేదన్నారు. మెరుగైన పనితీరును కనబర్చిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఏపీఓ పీవీజీ కృష్ణమూర్తి, అంబుడ్‌మెన్ వీరమల్లు పాల్గొన్నారు.
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
చౌటుప్పల్ : రక్తదానం చేయడం వల్ల ప్రాణా పాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమమ జనరల్ మేనేజర్ సత్యచంద్ర దివి వర్ధంతి సందర్భంగా సోమవారం కంపెనీలో రక్తదాన శిబిరాన్ని ప్రా రంభించి మాట్లాడారు. యువత రక్తం ఇచ్చేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ మన్మథకుమార్, దివీస్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్లు రామకృష్ణ, హేమంత్‌కుమార్, పి.శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, లైజాన్ ఆఫీసర్లు బి.కిషోర్‌కుమార్‌చౌదరి, కె.శివప్రసాద్, ఆర్‌కేసీ ప్రతినిధులు సావిత్రి, మోహన్‌రావు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక


