ఆశీర్వదించండి అమ్మా నాన్న
రోడ్డేస్తేనే ఓటేస్తాం..
వేములపల్లి : తమ కాలనీకి సర్వీస్ రోడ్డు వేస్తేనే ఓటు వేస్తాం లేదంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామంటూ నల్లగొండ జిల్లా వేములపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతోంది. వేములపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్‌ఎస్పీ క్యాంపు కాలనీకి రాకపోకలు కొనసాగించాలంటే వేములపల్లి మండల కేంద్రం నంచి నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై రాంగ్ రూట్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో జరగబోయే ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తామంటూ ఎన్‌ఎస్పీ కాలనీ ప్రజలు వాట్యాప్ గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. రోడ్డు వేయిస్తామని హామీ ఇస్తే తప్ప ఓటు వేసేది లేదని పేర్కొంటున్నారు.
ఆశీర్వదించండి అమ్మా నాన్న


