నారాయణపురం వాసికి డాక్టరేట్
సంస్థాన్‌నారాయణపురం: మండల కేంద్రానికి చెందిన ఎస్.గోవర్థన్ అన్నమలై యూ నివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌కు ఎంపికయ్యాడు. ఫర్ఫార్మెన్స్ ఈవాల్యుయేషన్ ఆఫ్ గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇన్ ఇండియా– ప్రీ అండ్ పోస్ట్ కోవిడ్–19 సీనారియో.. అనే అంశంపై గోవర్థన్ పరిశోధన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఎంబీఏ విభాగానికి హెచఓడీగా కొనసాగుతున్నారు.
యాదగిరీశుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పర్వాలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేవ చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు.
నారాయణపురం వాసికి డాక్టరేట్


