నేతల హామీలు.. శిలాఫలకాలకే పరిమితమా!
గుండాల : మండలంలోని నూనెగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రెండున్నర ఏళ్ల వ్యవధిలో రెండుసార్లు ప్రజాప్రతినిధులు శిలాఫలకాలను ఆవిష్కరించి, పనులకు శంకుస్థాపన చేయడం విస్మయానికి గురిచేస్తోంది. భవన నిర్మాణానికి 2023లో ఉపాధిహామీ పథకం నిధులు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. 2023 ఫిబ్రవరిలో అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 2025 జనవరిలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే పనికి ఒకే చోట శంకుస్థాపన చేశారే తప్ప.. ఇప్పటి వరకు ఇటుక కూడా పేర్చలేదు.
నేతల హామీలు.. శిలాఫలకాలకే పరిమితమా!


