
వైభవంగా సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం వైభవంగా శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను జరిపించారు. ఆలయ ముఖ మండపంపై గల ఉత్తరం దిశలోని మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్య కల్యాణం వేడుకను వేద మంత్రోత్సరణలతో జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ద్వార బంధనం చేశారు.
ధరల నియంత్రణకు
మండలస్థాయి కమిటీలు
రామన్నపేట : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇబ్బంది కలుగకుండా మెటీరియల్ ధరలు, మేసీ్త్రల కూలిరేట్ల నియంత్రణకు మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం రామన్నపేట మండలం ఉత్తటూరు, రామన్నపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్‌ఐలతో కూడిన కమిటీ ఇసుక, స్టీల్, సిమెంట్‌ను మార్కెట్‌ధర కంటే తక్కువకు ఇప్పిస్తుందన్నారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామన్నపేటలో కళ్లెం భిక్షమమ్మ అనే లఽబ్ధిదారురాలుకు రూ.10వేల ఆర్థికసాయం అందించారు. ఆయనవెంట తహసీల్దార్ లాల్‌బహదూర్‌శాస్త్రి, ఎంపీడీఓ యాకుబ్‌నాయక్ ఏఈలు గాలయ్య, సురేష్, కార్యదర్శి ఉపేందర్ ఉన్నారు.
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
వలిగొండ : భూభారతి సదస్సుల్లో వచ్చిన దరకాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం వలిగొండ తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ జితేందర్రెడ్డి, తహసీల్దార్ దశరథ, డీటీ పల్లవి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
మొక్కలు ధ్వంసం.. రూ.10 వేల జరిమానా
భువనగిరిటౌన్ : భువనగిరి పెద్ద చెరువు కట్టపై మొక్కలు ధ్వంసం చేసిన వ్యక్తికి రూ.10 వేల జరిమానా విధించారు. వివరాల ప్రకారం భువనగిరికి చెందిన సాయికుమార్ బుధవా రం తన బైక్‌పై పెద్దచెరువు కట్టపైకి వచ్చాడు. ఈ క్రమంలో కట్టపైన మొక్కలను విరగ్గొట్టి ధ్వంసం చేశారు. స్థానికులు గమనించి ఫారెక్ట్ అధికారికి సమాచారం ఇవ్వడంతో పాటు, అతడి బైక్ నంబర్‌ను పంపించారు. సదరు వ్యక్తి వివరాలు ఆరాదీసి అతనికి రూ.10 వేల జరిమానా విధించినట్టు ఫారెస్ట్ భువనగిరి రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు.

వైభవంగా సుదర్శన హోమం