
ఎంజీయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈఓ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 21.76 శాతం, రెండవ సెమిస్టర్ 23.56 శాతం, మూడో సెమిస్టర్‌లో 31.08 శాతం, నాలుగో సెమిస్టర్‌లో 36.05 శాతం, ఐదవ సెమిస్టర్‌లో 37.03 శాతం, ఆరవ సెమిస్టర్‌లో 46.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, కోఆర్డినేటర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, భిక్షమయ్య పాల్గొన్నారు.